అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ ప్రాంతాల్లో తెలుగు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ (TLCA) ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు జూన్ 28న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

తండ్రుల ప్రేమ, త్యాగం, అంకితభావాన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు కలిసి పాల్గొనేలా ఈ వేడుకలను రూపొందించామని పేర్కొన్నారు. "ఎంత ఎత్తుకు ఎదిగినా మనం చూసి నేర్చుకునే వ్యక్తి తండ్రే" అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా TLCA అధ్యక్షుడు సుమంత్ రాంసెట్టి నేతృత్వంలోని కార్యవర్గం సభ్యులు తెలుగు కుటుంబాలను పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.