మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న 'ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)' ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సంస్థ వ్యవస్థాపకురాలు ఝాన్సీ రెడ్డి ఆవిష్కరించారు. జూన్ 24న జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో వేటా ఇండియా సంస్థను ఘనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ మహిళల సాధికారత, నాయకత్వ వికాసం, ఉపాధి, విద్య, ఆరోగ్య రంగాల్లో సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వేటా ఇండియాను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు. మహిళల జీవితాల్లో నిజమైన సాధికారత అంటే నిర్ణయాధికారం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు అవకాశాల సృష్టి అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, యువతులు, విద్యార్థినులు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే వేదికగా వేటా ఇండియా నిలుస్తుందని చెప్పారు.

జూన్ 24న జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే సమ్మిట్‌లో మహిళా సాధికారత, న్యాయ అవగాహన, ఉపాధి అవకాశాలు, నాయకత్వ వికాసం, ఆరోగ్యం, సుస్థిర అభివృద్ధి, కెరీర్ నిర్మాణం వంటి అంశాలపై పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారని తెలిపారు.

అదేవిధంగా "ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ చాలెంజ్–2026" విజేతలను ఈ కార్యక్రమంలో ప్రకటించి, నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఝాన్సీ రెడ్డి వెల్లడించారు.

WETA.jpg