అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్లో రాజకీయ నాయకత్వం, ప్రజా విధానాల రూపకల్పన, ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రభావవంతమైన భాగస్వామ్యం వంటి అంశాలపై “Excellence in Political Lobbying – Building Influence, Shaping Policy” పేరిట ప్రత్యేక ప్యానెల్ చర్చ నిర్వహించనున్నారు. ఈ మహాసభలు జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నాయి.

ఈ ప్రత్యేక సెషన్ ఆగస్టు 1, శనివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4:10 గంటల వరకు జరగనుంది. అమెరికా రాజకీయ వ్యవస్థలో లాబీయింగ్ పాత్ర, విధానాల రూపకల్పనలో కమ్యూనిటీ భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధులతో సమర్థవంతమైన అనుసంధానం వంటి అంశాలపై నిపుణులు తమ అనుభవాలను పంచుకోనున్నారు.

ఈ ప్యానెల్‌లో Federal Hall Policy Advisors భాగస్వామి సాత్ అలెటీ (Saat Alety), మాజీ ఒహియో సెనేటర్ నిరాజ్ అంటానీ (Niraj Antani) ప్యానెలిస్టులుగా పాల్గొంటారు. వర్జీనియా ఏషియన్ అడ్వైజరీ బోర్డు చైర్ శ్రీలేఖ రెడ్డి పల్లె ఈ చర్చకు మోడరేటర్‌గా వ్యవహరిస్తారు.

అమెరికాలో తెలుగు సమాజం ప్రజా విధానాల రూపకల్పనలో మరింత చురుకైన పాత్ర పోషించేందుకు అవసరమైన అవగాహన, నాయకత్వ నైపుణ్యాలు, రాజకీయ భాగస్వామ్య అవకాశాలపై ఈ సెషన్ విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని ATA నిర్వాహకులు తెలిపారు. రాజకీయ, సామాజిక, ప్రజా సేవ రంగాలపై ఆసక్తి ఉన్న యువతతో పాటు కమ్యూనిటీ నాయకులు ఈ సెషన్‌ను తప్పక వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు.

ఈ ప్రతిష్టాత్మక మహాసభలను ATA అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో ATA టీమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, డైరెక్టర్ సుధీర్ దామిడి, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్, కో-కన్వీనర్ అరవింద్ ముప్పిడి, కో-నేషనల్ కోఆర్డినేటర్ కౌశిక్, కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి మునుకుంట్ల, కో-డైరెక్టర్ కిరణ్ ఆలా తదితరులు సమన్వయంతో పనిచేస్తూ మహాసభలను విజయవంతం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

WhatsApp Image 2026-07-27 at 5.48.38 PM.jpeg