అమెరికాలోని సియాటిల్ ప్రాంత తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఉద్దేశంతో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సియాటిల్ (ATA-Seattle) ఆధ్వర్యంలో వనభోజనాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 9, 2026 (ఆదివారం) ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు విల్బర్టన్ హిల్ కమ్యూనిటీ పార్క్, బెల్లెవ్యూ, వాషింగ్టన్లో జరగనుంది.

తెలంగాణ సంప్రదాయాలను విదేశాల్లోని కొత్త తరానికి పరిచయం చేయడంతో పాటు, తెలుగు కుటుంబాల మధ్య ఆత్మీయ బంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ వనభోజనాల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కుటుంబ సభ్యులు, చిన్నారులు, యువత, పెద్దలు అందరూ కలిసి ఆనందంగా గడిపేలా ప్రత్యేక కార్యక్రమాలను సిద్ధం చేశారు.

ఈ వనభోజనాల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, బింగో, లెమన్-స్పూన్ రేస్, మ్యూజికల్ చెయర్స్, వంటల పోటీలు, గ్రిల్ (బార్బిక్యూ) వంటి వినోదాత్మక పోటీలతో పాటు సంప్రదాయ తెలంగాణ రుచులతో ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు. విజేతలకు బహుమతులు కూడా అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ATA సియాటిల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి బండారపు నేతృత్వంలోని కార్యవర్గం ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సియాటిల్‌తో పాటు వాషింగ్టన్ రాష్ట్రంలోని తెలుగు కుటుంబాలందరూ కుటుంబ సమేతంగా హాజరై ఈ వనభోజనాలను విజయవంతం చేయాలని ATA సియాటిల్ ఆహ్వానించింది.

ATA Vanabojanalu.jpg