బాల్టిమోర్‌లో జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్లో భాగంగా "America250 – The Indian American Journey in Shaping the Nation" అనే ప్రత్యేక ప్యానెల్ చర్చ నిర్వహించనున్నారు. ఆగస్టు 1న మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 2:40 గంటల వరకు జరిగే ఈ సెషన్‌లో భారతీయ అమెరికన్లు అమెరికా అభివృద్ధి, రాజకీయాలు, విద్య, ప్రజాసేవ రంగాల్లో అందిస్తున్న విశిష్ట సేవలపై చర్చించనున్నారు.
ఈ చర్చలో సన్నీ రెడ్డి, బంగార్ రెడ్డి, శ్రీలేఖ రెడ్డి పల్లె ప్యానెలిస్టులుగా పాల్గొంటారు. భారతీయ అమెరికన్ల విజయగాథ, నాయకత్వం, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలపై వీరు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ఆటా మహాసభల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.
ఆటా మహాసభలను అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో ATA టీమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, డైరెక్టర్ సుధీర్ దామిడి, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్, కో-కన్వీనర్ అరవింద్ ముప్పిడి, కో-నేషనల్ కోఆర్డినేటర్ కౌశిక్, కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి మునుకుంట్ల, కో-డైరెక్టర్ కిరణ్ ఆలా తదితరులు సమన్వయంతో పనిచేస్తూ మహాసభలను విజయవంతం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.











