అట్లాంటాలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) రక్తదాన శిబిరాన్ని నిర్వహించనుంది. సెప్టెంబర్ 13, ఆదివారం సువానీ నగరంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రక్తదాన శిబిరం కొనసాగనుంది.

5400 Laurel Springs Pkwy, Suite #704, Suwanee, GA 30024లో ఈ డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. రక్తదానం చేయాలనుకునే వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ATA నిర్వాహకులు సూచించారు.

సమాజ సేవలో భాగంగా నిర్వహిస్తున్న ఈ రక్తదాన కార్యక్రమంలో స్థానిక తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ATA ప్రతినిధులు కోరారు. ఒక వ్యక్తి చేసే రక్తదానం అవసరంలో ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

అట్లాంటా ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహణకు రీజినల్ కోఆర్డినేటర్లు కిరణ్ తాడకమళ్ల, అనిల్ కుష్నపల్లి, చంద్రశేఖర్ అల్తాతి, స్వాతి రెడ్డి, రీజినల్ డైరెక్టర్లు సందీప్ గుండ్ల, శ్రుతి చిట్టోరి తదితరులు సహకరిస్తున్నారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు శ్రీధర్ తిరుపతి, శ్రీరామ్ శ్రీనివాస్, కిరణ్ పాశం, అనిల్ బొడ్డిరెడ్డి కూడా కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు.

ATA జాతీయ కార్యవర్గానికి జయంత్ చల్లా అధ్యక్షుడిగా, సతీష్ రామసహాయం రెడ్డి ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా, మధు బొమ్మినేని గత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

రక్తదాన శిబిరం వివరాలు

📅 తేదీ: సెప్టెంబర్ 13, 2026 (ఆదివారం)
⏰ సమయం: ఉదయం 9:00 – మధ్యాహ్నం 3:00
📍 వేదిక: 5400 Laurel Springs Pkwy, Suite #704, Suwanee, GA 30024

రిజిస్ట్రేషన్: ATA Blood Donation Drive Registration

WhatsApp Image 2026-09-12 at 7.29.46 PM.jpeg