తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
అక్టోబర్ 18, 2026 ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బతుకమ్మ సాంబరాలు జరగనున్నాయి. Aldie, Virginiaలోని John Champe High School వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
తెలంగాణ మహిళలు, కుటుంబాలు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మను పేర్చి, ఆటపాటలతో వేడుకలను జరుపుకోనున్నారు. తెలంగాణ సంప్రదాయం, సంస్కృతి, కమ్యూనిటీ ఐక్యతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు TDF DC టీమ్ తెలిపింది.
గత 20 ఏళ్లుగా అందిస్తున్న మద్దతుకు TDF DC నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, వేడుకల్లో భాగంగా వెండర్‌గా పాల్గొనాలనుకునే వారు నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు. Contact : (571) 426-0383.
















