బాలీవుడ్ లెజెండరీ సింగర్ సోనూ నిగమ్ తన సూపర్‌హిట్ పాటలతో న్యూయార్క్‌లో సంగీత సందడి చేశారు. ‘REVOLUTION – Sonu Nigam Live’ పేరుతో నిర్వహించిన ఈ గ్రాండ్ కాన్సర్ట్ అభిమానులకు ఓ మధురమైన సంగీత అనుభూతిని అందించింది.

సెప్టెంబర్ 13న Nassau Veterans Memorial Coliseumలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో సంగీత ప్రియులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకు డోర్స్ ఓపెన్ కాగా.. 6 గంటలకు షో ప్రారంభమైంది.

టైమ్‌లెస్ బాలీవుడ్ మెలోడీస్, సోల్‌ఫుల్ క్లాసిక్స్‌తో పాటు తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో సోనూ నిగమ్ స్టేజ్‌పై అదరగొట్టారు. ఆయన గాత్రానికి అభిమానులు చప్పట్లు, కేరింతలతో సందడి చేశారు.

Atique B Sheikh of Worldstar ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం.. న్యూయార్క్‌లోని బాలీవుడ్ మ్యూజిక్ లవర్స్‌కు ఓ మర్చిపోలేని మ్యూజికల్ ఈవెనింగ్‌గా నిలిచింది.