ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంతో పాటు స్థానిక పాఠశాలలకు, యువతకు, కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు అండగా నిలిచేందుకు Best Runners ఆధ్వర్యంలో 14వ వార్షిక Charity 1K & 5K Run నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13, ఆదివారం అశ్‌బర్న్‌లోని Rock Ridge High School వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.

“Run with us to build a healthy society” అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ రన్‌లో పిల్లలు, కుటుంబ సభ్యులు, రన్నర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. Kids & Family Run/Walk ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఎంట్రీ ద్వారా స్థానిక పాఠశాలలకు అవసరమైన సామగ్రి అందించడం, యువతను ప్రోత్సహించడం, కమ్యూనిటీ సర్వీస్ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం వంటి సేవా కార్యక్రమాలకు సహకారం అందుతుంది. అలాగే ఆకలితో పోరాటం, ఆరోగ్య ప్రోత్సాహం, విద్యకు నిధులు, మహిళా సాధికారత, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలకు కూడా మద్దతు ఇవ్వనున్నారు.

గ్రూప్ రిజిస్ట్రేషన్‌తో $5 సేవింగ్! 💰

5 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి రిజిస్టర్ చేసుకుంటే ఒక్కొక్కరిపై $5 వరకు ఆదా చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారు లేదా స్కూల్ కమ్యూనిటీతో కలిసి టీమ్‌గా పాల్గొనాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

  • Group Registration (5+): Adults $25 | Kids $15

  • Regular Registration: Adults $30 | Kids $20

పాల్గొనేవారికి Post-Race Snacks, Race Medal, Awesome Race Shirt అందించనున్నారు.

WhatsApp Image 2026-09-11 at 6.36.06 PM.jpeg