అమెరికా ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో ప్రత్యేక ఆర్ట్ ఎగ్జిబిట్ నిర్వహించనున్నారు. తామా 45 ఏళ్ల సేవలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జూలై 25న సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆల్ఫారెట్టాలోని 160 Martin Driveలో జరగనుంది. ఈ ప్రదర్శనలో ఎవరైనా పాల్గొనవచ్చని, తమ సృజనాత్మకతను కళారూపంలో ఆవిష్కరించేందుకు ఇది మంచి అవకాశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి తామా ప్రెసిడెంట్ సునీత పొట్నూరు, చైర్మన్ మధుకర్ యార్లగడ్డ నాయకత్వం వహిస్తున్నారు. ఆర్ట్ ఎగ్జిబిట్ కమిటీ సభ్యులుగా తిరు చిల్లపల్లి, సునీల్ దేవరపల్లి, సత్య నాగేందర్ గుత్తుల, చలమయ్య బచ్చు, ముఖర్జీ వేములపల్లి, శ్రీనివాస్ రామనాధం, పార్వతి కొంపెల్ల, శేఖర్ కొల్లు, చైతన్య కొర్రపాటి, నరేంద్ర బాబు నల్లూరి, ప్రియా బాలుసు, వెంకట్ తెరాల, నాగేష్ దొడ్డాక, రాఘవ తాడవర్తి, రామ్కి చౌదవరపు, సాయి రామ్ కరుమంచి, సురేష్ యాదగిరి, వెంకట్ మీశాల, యశ్వంత్ జొన్నలగడ్డ, హరికృష్ణ అడ్డంకి సేవలందిస్తున్నారు.

ఈ ఆర్ట్ ఎగ్జిబిట్‌లో ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రతి కళాఖండం ఒక ప్రత్యేక కథను చెప్పేలా... సృజనాత్మకత, చరిత్ర, సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించే చిత్రాలతో ఈ వేడుకను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని నిర్వాహకులు భావిస్తున్నారు. పాల్గొనే ప్రతి ఒక్కరికీ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ అందజేయడంతో పాటు, లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నారు. నమోదు రుసుము 10 డాలర్లుగా నిర్ణయించారు

. 45 ఏళ్లుగా తెలుగు సమాజానికి సేవలందిస్తున్న తామా, కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికను అందిస్తూ, అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తెలుగు కమ్యూనిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

732736251_17865316533635248_7663785514491730034_n.heic