అమెరికాలోని చికాగోలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని Chicago Bikers Club (CBC) ఆధ్వర్యంలో "India's Heritage & Independence Day Bikers Parade"ను ఆగస్టు 15న ఘనంగా నిర్వహించనున్నారు.
భారతీయ వారసత్వాన్ని చాటిచెప్పడంతో పాటు అమెరికా స్వేచ్ఛా విలువలను గౌరవిస్తూ, రెండు దేశాల మధ్య స్నేహబంధం, ఐక్యతను ప్రతిబింబించేలా ఈ ప్రత్యేక బైకర్స్ పరేడ్ నిర్వహించబడుతోంది. ఈ ఏడాది పరేడ్‌కు చికాగో బైకర్స్ క్లబ్ నాయకత్వం వహించనుంది.
బైకర్లు భారత, అమెరికా జాతీయ జెండాలతో మోటార్‌సైకిళ్లపై ర్యాలీగా బయలుదేరి National India Hub, 930 National Parkway, Schaumburg, Illinois 60173 వద్ద జరిగే ప్రధాన పరేడ్‌లో పాల్గొననున్నారు.
కార్యక్రమ వివరాలు
తేదీ: శనివారం, ఆగస్టు 15
మీట్‌అప్ ప్రదేశం: Starbucks, 95th Street & Route 59, Naperville
మీట్‌అప్ సమయం: ఉదయం 9:00 గంటలు
రైడ్ ప్రారంభం: ఉదయం 9:30 గంటలు
పరేడ్ చేరిక: ఉదయం 10:45 గంటలు
పరేడ్ ప్రారంభం: ఉదయం 11:30 గంటలు
పరేడ్ వేదిక: National India Hub, 930 National Parkway, Schaumburg, IL 60173
ఈ కార్యక్రమంలో భారతీయులు, బైకింగ్ అభిమానులు, కమ్యూనిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని భారత-అమెరికా జాతీయ జెండాలతో దేశభక్తి, స్వేచ్ఛ, సాంస్కృతిక ఐక్యత సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.










