భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రత్యేక గౌరవం చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా మువ్వన్నెల కాంతులతో మెరిసిపోయింది.

కేసరి, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో వెలిగిన బుర్జ్ ఖలీఫా.. భారత్‌ జాతీయ పండుగకు ఘన నివాళిగా నిలిచింది. దుబాయ్ నగరంలోని పలు ప్రాంతాలు కూడా త్రివర్ణ కాంతులతో సందడి చేశాయి.

ఈ వేడుకల్లో భారతీయ ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొని స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత్–UAEల మధ్య బలమైన మైత్రి, సోదరభావానికి ప్రతీకగా దుబాయ్ ఇచ్చిన ఈ గౌరవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.