అమెరికాలోని కేన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (KCTCA) ఆధ్వర్యంలో తెలంగాణ సాంప్రదాయ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 2న హెరిటేజ్ పార్క్‌లోని షెల్టర్ నంబర్–9లో ఈ వేడుకలు జరగనున్నట్లు KCTCA ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సంయుక్తంగా ప్రకటించాయి.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేన్సాస్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలందరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు.

బోనాల సందర్భంగా సంప్రదాయ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ జానపద కళారూపాలు, కుటుంబ సభ్యులందరికీ ఆహ్లాదకరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. తెలంగాణ ఆత్మీయత, సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గొనాలని KCTCA నాయకత్వం కోరింది.

KCTCA  Executive committee and Board of trustees-warmly welcomes the community to our Telangana .jpg