అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం చార్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్ 2026లో భాగంగా నిర్వహించిన బ్యూటీ పేజెంట్ & ఫ్యాషన్ అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ‘టీన్ టీటీఏ’, ‘మిస్ టీటీఏ’, ‘మిసెస్ టీటీఏ’ విభాగాల్లో పాల్గొన్న పోటీదారులు తమ అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ, స్టేజ్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వివిధ రౌండ్లలో ప్రతిభ కనబరిచిన విజేతలకు టీటీఏ ఫ్యాషన్ అవార్డ్స్ అందజేశారు.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘టీన్ టీటీఏ – 2026’ విజేతకు నిర్వాహకులు ఘనంగా కిరీటాన్ని అలంకరించి సత్కరించారు. విజేతలందరికీ ట్రోఫీలు, స్మారక చిహ్నాలు అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ బ్యూటీ పేజెంట్ కార్యక్రమం టీటీఏ మెగా కన్వెన్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవాస తెలుగు యువత, మహిళలు తమ వ్యక్తిత్వం, ఫ్యాషన్ సెన్స్, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం ఉత్తమ అవకాశాన్ని కల్పించింది.

విజేతలను కన్వెన్షన్ నిర్వాహకులు, ముఖ్య అతిథులు, ప్రేక్షకులు ఘనంగా అభినందించగా, కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.