అమెరికాలోని మియామీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను చాటేలా TTA Miami – Bathukamma Dasara 2026 వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. “A Celebration of Telangana Culture, Tradition & Togetherness” థీమ్‌తో అక్టోబర్ 10న ఈ వేడుకలను నిర్వహించనున్నారు.

పెంబ్రోక్ పైన్స్‌లోని SW Focal Point Community Centerలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వేడుకలు కొనసాగనున్నాయి. సాయంత్రం 3:45, 4:45, 7:30 గంటలకు కల్చరల్ డ్యాన్స్‌లు, 4 గంటలకు కుంకుమ పూజ, 5 గంటలకు బతుకమ్మ ఆట నిర్వహించనున్నారు. రాత్రి 7:30 గంటలకు ఫుడ్, మ్యూజిక్‌తో పాటు దాండియా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ వేడుకల్లో సింగర్ వైష్ణవి ప్రత్యేకంగా పాల్గొననున్నారు. కార్యక్రమానికి వచ్చే వారికి ప్రవేశం ఉచితం, ఉచిత భోజనం అందించనున్నారు. అలాగే ఎంట్రీ రాఫిల్ ప్రైజులు, బెస్ట్ బతుకమ్మ బహుమతులు, వెండర్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.

TTA Miami Chapter Team

ఈ కార్యక్రమం నిర్వహణలో TTA Miami ప్రాంతీయ సమన్వయకర్తలుగా అజయ్ కుమార్ అమరనాయిని, అనుదీప్ ఇల్లపాకర్తి, నరేష్ గాడే, అజయ్ రెడ్డి నాలువాల, అనూప్ రెడ్డి కొణపగారి, ప్రాంజలి రెడ్డి పీచు వ్యవహరిస్తున్నారు.

చాప్టర్ టీమ్‌లో అమూల్య కొల్లూరు, హర్షవర్ధన్ పమ్మి, శిరీష్ వేమని, ఫణీంద్ర అల్లాడి ఉన్నారు. క్రాంతి కతెరశాల TTA రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

TTA Executive Committee

TTA ఎగ్జిక్యూటివ్ కమిటీలో నవీన్ రెడ్డి మల్లిపెద్ది – ప్రెసిడెంట్, సోదర్ పెద్ది రెడ్డి – ప్రెసిడెంట్ ఎలెక్ట్ / ట్రెజరర్, గణేష్ వీరమనేని – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, శివ రెడ్డి కొల్ల – జనరల్ సెక్రటరీ, కవిత రెడ్డి – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు.

అలాగే నిశాంత్ సిరికొండ – జాయింట్ సెక్రటరీ, స్వాతి చెన్నూరి – జాయింట్ ట్రెజరర్, ప్రదీప్ మెట్టు – నేషనల్ కోఆర్డినేటర్, నరసింహ పెరుక – ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ప్రవీణ్ చింత – డెవలప్‌మెంట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డా. నరసింహ రెడ్డి దొంతిరెడ్డి TTA 10వ వార్షికోత్సవానికి చైర్‌గా ఉన్నారు.

Advisory Council

TTA అడ్వైజరీ కౌన్సిల్‌లో డా. పైళ్ల మల్లా రెడ్డి – ఫౌండర్, డా. విజయపాల్ రెడ్డి – చైర్, డా. మోహన్ రెడ్డి పటాలోల్ల – కో-చైర్, డా. భరత్ రెడ్డి మాదాడి – సభ్యుడు, వంశీ రెడ్డి కంచరకుట్ల – సభ్యుడుగా ఉన్నారు.

స్పాన్సర్లు

ఈ వేడుకలకు BankUnited ప్లాటినం స్పాన్సర్‌గా, Siri Financial Solutions, TalentFit AI గోల్డ్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. Vallem Vari Farms / Ajay Reddy Naluwala, Gopi Gajawada / Anudeep Illapakurthy సిల్వర్ స్పాన్సర్లుగా, Dasara ఫుడ్ స్పాన్సర్‌గా ఉన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోని తెలుగు సమాజానికి మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ బతుకమ్మ–దసరా వేడుకలకు మియామీ పరిసర ప్రాంతాల్లోని తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

tta miami.png