ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్సార్ 17వ వర్ధంతి, 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరుల స్మరణార్థం.. ఫిలడెల్ఫియాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

అమెరికన్ రెడ్ క్రాస్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా పాల్గొన్నారు. ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి, డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, విజయ్ పోలంరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా గత 17 ఏళ్లుగా సెప్టెంబర్‌లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్.. ఇప్పటివరకు 2,300 మందికి పైగా రక్తదానం చేయించింది.

ఫిలడెల్ఫియాతో పాటు డాలస్, ఇతర నగరాల్లోనూ ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమానికి సహకరిస్తున్న ముఖ్య సలహాదారు డాక్టర్ ప్రేమ్ రెడ్డికి, వైఎస్సార్ అభిమానులకు, ఫౌండేషన్ కార్యవర్గానికి, రక్తదాతలకు ఫౌండేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ప్రతి ఏడాది రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ ఫౌండేషన్ సేవలను అమెరికన్ రెడ్ క్రాస్ ప్రత్యేకంగా ప్రశంసించింది.