అమెరికాలోని నార్త్ కరోలినాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా షార్లెట్ నగరంలో ప్రత్యేక "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కోఆర్డినేటర్ అలూరు సాంబశివరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమం జూలై 29 (బుధవారం) సాయంత్రం 7 గంటలకు షార్లెట్‌లోని ఉత్సవ్ ఈవెంట్ స్పేసెస్ (5533 Westpark Dr, Charlotte, NC 28217)లో నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ గ్రేటర్ షార్లెట్ ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది.

ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు అలూరు సాంబశివరెడ్డితో నేరుగా సమావేశమై పార్టీ భావజాలం, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ఆర్ఐల పాత్రపై తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

షార్లెట్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలు, వైఎస్సార్‌సీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ గ్రేటర్ షార్లెట్ ఆర్గనైజింగ్ కమిటీ విజ్ఞప్తి చేసింది.

ycp.jpeg