డల్లాస్‌లో తెలుగు, తమిళ సంగీతాభిమానులకు అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్ రెడీ అవుతోంది. ప్రముఖ గాయకుడు మనోతో స్పెషల్ మ్యూజికల్ కరోకే నైట్ సెప్టెంబర్ 5న ఘనంగా జరగనుంది.
“Musical Night with Mano – Live in Dallas” పేరుతో Sakthi Yogalaya ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు Mar Thoma Event Centerలో ఈ వేడుక జరగనుంది.
వేలాది పాటలతో ప్రేక్షకులను అలరించిన మనో.. తనదైన గాత్రంతో ఎన్నో తరాల అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో పాటలు పాడిన ఆయన.. ప్రపంచవ్యాప్తంగా 3,000కు పైగా లైవ్ కచేరీల్లో పాల్గొని ప్రేక్షకులను అలరించారు.
ఈ మ్యూజికల్ నైట్‌లో మనోతో కలిసి అభిమానులు పాటలు పాడుతూ, ఆయనతో మ్యూజిక్‌ను సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉండటంతో డల్లాస్‌లోని తెలుగు, తమిళ కమ్యూనిటీలో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా మనో స్వయంగా అభిమానులకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. డల్లాస్‌లో నిర్వహిస్తున్న ఈ సంగీత వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 5న డల్లాస్‌లో మనో మ్యూజికల్ నైట్.. సంగీతాభిమానులకు ఇది మిస్ కాకూడని స్పెషల్ ఈవెంట్!














