అమెరికాలో వలసదారులకు ఊరటనిచ్చే కీలక తీర్పు వెలువడింది. జూన్ 5, 2026న, అమెరికాలోని U.S. District Court for the District of Rhode Island, కొన్ని దేశాలకు చెందిన వలసదారుల ఆశ్రయం, వర్క్ పర్మిట్, గ్రీన్ కార్డ్ మరియు ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల దరఖాస్తులను నిలిపివేసిన USCIS విధానాలను చట్టవిరుద్ధమని ప్రకటించింది.
ముఖ్యంగా 2026 జనవరి 1న “హై-రిస్క్” దేశాలకు ఈ నిలుపుదలను విస్తరించిన మెమోరాండమ్‌ను కూడా కోర్టు రద్దు చేసింది. ఈ విధానాలు దేశ జన్మస్థానాన్ని ఆధారంగా చేసుకుని వేలాది మందిని అనిశ్చితిలోకి నెట్టాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో ప్రభావిత దేశాల దరఖాస్తుల ప్రాసెసింగ్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఏర్పడింది. వలస హక్కుల సంఘాలు ఈ నిర్ణయాన్ని పెద్ద విజయంగా స్వాగతించాయి.












