భారత సైన్యానికి చెందిన మేజర్ అభిలాష బరాక్ కు ఐక్యరాజ్యసమితి 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేసింది. లెబనాన్‌లోని యూఎన్ శాంతి భద్రతా మిషన్‌లో సేవలందిస్తున్న ఆమె మహిళా సాధికారత, లింగ సమానత్వం, స్థానిక మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది.

ఫీమేల్ ఎంగేజ్‌మెంట్ టీమ్ కమాండర్‌గా పనిచేసిన అభిలాష బరాక్, మహిళలు మరియు బాలికలను శాంతి ప్రక్రియల్లో భాగస్వాములను చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ అవార్డు అందుకున్న మూడో భారతీయురాలిగా ఆమె నిలిచారు