నేపాల్ లో ప్రకృతి బీభత్సం.. ఎటుచూసినా వరద నీరే.. ఈ విపత్కర పరిస్థితుల్లో పర్యటనకు వెళ్లిన ఓ మహిళ ఆచూకీ లేకుండా పోయారు. 42 ఏళ్ల పూనమ్ దిలీప్‌కుమార్ ఠక్కర్ నేపాల్‌లో గల్లంతవడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ ఆత్మీయురాలి జాడ ఎక్కడైనా తెలిసే అవకాశం ఉందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

పూనమ్ Himalayan Glacier బృందంతో కలిసి నేపాల్‌లో పర్యటిస్తున్నట్లు గల్లంతైన మహిళకు సంబంధించిన పోస్టర్‌లో పేర్కొన్నారు. ఆమె చివరిగా తైమూర్‌లోని హోటల్ కైలాష్, రసువాగఢి బోర్డర్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె ఆచూకీ తెలియరాలేదు.

పూనమ్ కోసం కుటుంబ సభ్యులు సమాచారం సేకరిస్తూ, ఆమెను గుర్తించేందుకు ప్రజల సహకారం కోరుతున్నారు. నేపాల్‌లోని స్థానికులు, అక్కడ పర్యటిస్తున్న వారు లేదా పూనమ్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసిన వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

సమాచారం ఉంటే సంప్రదించాల్సిన నంబర్లు

అమెరికా:
+1 630-306-1983
+1 630-306-0953

భారత్:
+91 98240 58278
+91 93275 25002

“మీ సమాచారం ఆమెను ఇంటికి తీసుకురావడంలో సహాయపడుతుంది.. దయచేసి ఈ సమాచారాన్ని షేర్ చేయండి” అంటూ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఒక్క సమాచారం.. ఓ కుటుంబానికి ఆశను ఇవ్వొచ్చు. పూనమ్ ఆచూకీ తెలిసిన వారు ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

WhatsApp Image 2026-08-27 at 7.39.33 PM.jpeg