అమెరికా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది..! వలస నియంత్రణను మరింత కఠినతరం చేయాలన్న లక్ష్యంతో 70 బిలియన్ డాలర్ల భారీ నిధుల బిల్లుకు అమెరికా సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ బిల్లుతో పాటు వివాదాస్పద "యాంటీ-వెపనైజేషన్" ఫండ్ కూడా రాజకీయ దుమారం రేపుతోంది. అసలు ఈ బిల్లులో ఏముంది? ఇప్పుడు చూద్దాం..!

అమెరికా సెనేట్ 52-47 ఓట్లతో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అమలు సంస్థల కోసం 70 బిలియన్ డాలర్ల భారీ నిధుల బిల్లును ఆమోదించింది. ఈ నిధులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో పదవీకాలం ముగిసే వరకు ICE, బోర్డర్ పట్రోల్ కార్యకలాపాలకు ఉపయోగించనున్నారు. బిల్లులో ఉన్న 1.8 బిలియన్ డాలర్ల “యాంటీ-వెపనైజేషన్” ఫండ్‌పై తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది.

ప్రభుత్వ లక్ష్యంగా మారిన వారికి పరిహారం ఇవ్వొచ్చన్న విమర్శలు వచ్చాయి. డెమోక్రాట్లు, కొందరు రిపబ్లికన్లు వ్యతిరేకించినప్పటికీ ఆ నిధిని తొలగించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి సరిహద్దు భద్రత, నిర్బంధం, బహిష్కరణ చర్యలపై దృష్టి పెట్టిన బిల్లు సెనేట్ ఆమోదం పొందింది. ఇప్పుడు ఈ బిల్లు ప్రతినిధుల సభ ఆమోదానికి వెళ్లింది.