ప్రపంచ వ్యాపార రంగంలో భారత సంతతికి చెందిన మహిళలు మరోసారి తమ సత్తా చాటారు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ విడుదల చేసిన 2026 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో భారత సంతతికి చెందిన 8 మంది చోటు దక్కించుకున్నారు.

ఈ జాబితాలో 9వ స్థానంలో రేష్మా కేవల్రామణి నిలవగా, 14వ స్థానంలో గుంజన్ కేడియా ఉన్నారు. 31వ స్థానంలో జయశ్రీ ఉల్లాల్, 35వ స్థానంలో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ చీఫ్ బేలా బజారియా నిలిచారు.

భారత్‌కు చెందిన రోష్ని నాడార్ మల్హోత్రా 33వ స్థానంలో ఉండగా, యూకేలోని లీనా నాయర్ 37వ స్థానం దక్కించుకున్నారు. అలాగే మీనా ఫ్లిన్ 74వ స్థానం, రేవతి అద్వైతి 75వ స్థానం సాధించారు.

20 దేశాలకు చెందిన 94 కంపెనీల మహిళా నాయకులు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, వీరి సంస్థలు కలిపి 11.8 మిలియన్ల ఉద్యోగులను నిర్వహిస్తూ, 7.3 ట్రిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి. భారత సంతతికి చెందిన మహిళల గ్లోబల్ ప్రభావానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది.