యూట్యూబర్ Nick Shirley షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియా ఓటర్ రిజిస్ట్రేషన్ రికార్డుల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
వీడియోలో డోరిస్ అనే మహిళ ఇంటికి వెళ్లిన షిర్లీ, రాష్ట్ర రికార్డుల ప్రకారం ఆమె వయస్సు 126 సంవత్సరాలు అని, అలాగే 51 ఎన్నికల్లో ఓటు వేసినట్లు నమోదైందని పేర్కొన్నారు. అయితే డోరిస్ వెంటనే ఆ సమాచారాన్ని ఖండిస్తూ, అది పూర్తిగా తప్పు అని చెప్పింది. తాను 1940లో జన్మించానని స్పష్టం చేసింది.
రికార్డుల్లో ఉన్న వివరాలు తనవికావని డోరిస్ పేర్కొనగా, ఓటర్ జాబితాల్లో పెద్ద ఎత్తున తప్పులు ఉన్నాయని షిర్లీ ఆరోపించారు. “126 ఏళ్ల వయస్సు ఎలా సాధ్యం?” అంటూ ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వీడియోలో చేసిన ఆరోపణలపై కాలిఫోర్నియా ఎన్నికల అధికారులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.












