దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డీన్ ఎల్గర్ తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. కెరీర్‌లో చివరి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ సాధించి తన జట్టును కష్టాల నుంచి బయటపడేసే ప్రయత్నం చేశాడు.
గ్లామోర్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫాలోఆన్ ఆడుతున్న ఎసెక్స్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఇంకా గ్లామోర్గాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 45 పరుగుల వెనుకబడి ఉంది.
ఎల్గర్ 108 పరుగులు చేసి తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 57వ సెంచరీని నమోదు చేశాడు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన 284 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ఇదే అతని చివరి మ్యాచ్. టామ్ వెస్ట్లీతో కలిసి ఎల్గర్ 166 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అంతకుముందు ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 129 పరుగులకే ఆలౌటైంది. గ్లామోర్గాన్ బౌలర్ జైన్-ఉల్-హసన్ 5/14తో కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. దీంతో ఎసెక్స్‌పై 376 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన గ్లామోర్గాన్ ఫాలోఆన్ విధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఎల్గర్, వెస్ట్లీ పరిస్థితిని చక్కదిద్దగా.. అనంతరం జార్జ్ బెల్ ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 42 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. నాలుగు వరుస బౌండరీలతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న బెల్, నోహ్ థైన్‌తో కలిసి 65 పరుగుల అజేయ భాగస్వామ్యంతో నాలుగో రోజు ఆటకు సిద్ధమయ్యాడు.
మూడో రోజు ముగిసే సమయానికి ఎసెక్స్ 331/5తో ఉండగా.. గ్లామోర్గాన్ 505 పరుగులు చేసింది. ఫాలోఆన్‌లో ఎసెక్స్ ఇంకా 45 పరుగుల వెనుకంజలో ఉంది.












