ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త నేషనల్ సెలెక్టర్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ నార్త్ నియమితులయ్యారు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ అనంతరం పదవి వీడిన ల్యూక్ రైట్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం డర్హమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేస్తున్న నార్త్.. ఇకపై ఇంగ్లండ్ రెడ్ బాల్, వైట్ బాల్ జట్ల ఎంపికలతో పాటు దేశీయ క్రికెట్ ప్రతిభను గుర్తించే బాధ్యతలు నిర్వహించనున్నారు.

2009 యాషెస్ సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించిన నార్త్ ఆస్ట్రేలియా తరఫున 21 టెస్టులు ఆడారు. ఇంగ్లండ్ క్రికెట్ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. నార్త్ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పేర్కొన్నారు.