2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో హిట్‌మ్యాన్ లేడంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది. రివ్యూ మీటింగ్ అనంతరం కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా.. రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఇలాంటి పుకార్లకు తావివ్వొద్దని స్పష్టం చేశారు.
ఇక ప్రపంచకప్‌లో రోహిత్ రికార్డులు చూస్తే.. మూడు టోర్నీల్లో 28 మ్యాచ్‌లు ఆడి 1575 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 7 సెంచరీలు ఉన్నాయి. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ రోహితే.
అంతేకాదు.. ప్రపంచకప్‌లో 54 సిక్సర్లతో ఈ విషయంలోనూ హిట్‌మ్యాన్‌దే అగ్రస్థానం. ఇక 2023లో శ్రీలంకపై భారత్‌కు 302 పరుగుల భారీ విజయాన్ని అందించిన కెప్టెన్‌గానూ రోహిత్ రికార్డు సృష్టించాడు. మరి ఈ రికార్డుల హిట్‌మ్యాన్ 2027 ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది.









