మహిళల టీ20 ఆసియా కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. థాయిలాండ్, హాంకాంగ్‌పై భారీ విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
ఇదిలా ఉంటే.. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ శ్రీ చరణి అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచింది.
హాంకాంగ్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన శ్రీ చరణి.. 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో ఈ ఏడాది ఆమె వికెట్ల సంఖ్య 31కి చేరింది. తద్వారా 2024లో 30 వికెట్లు తీసిన దీప్తి శర్మను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంది.
ఈ జాబితాలో పూనమ్ యాదవ్ 2018లో 35 వికెట్లతో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే.. ఈ ఏడాది ముగిసేలోపే శ్రీ చరణి అగ్రస్థానాన్ని అధిగమించే అవకాశం ఉంది.









