
మేషం
మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వారాంతంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా గ్రహగతులు ఉన్నాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా వినండి. శుక్రవారం రోజున విష్ణుమూర్తికి తులసీమాల సమర్పించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభం
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సహోదరి సహోదరుల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది దానికి తగినట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సుబ్రమణ్య స్వామి వారి అష్టకం చదవండి అలాగే సుబ్రమణ్య స్వామి వారిని దర్శనం చేసుకోండి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటపడేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి
మిధునం
మిధున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. నూతన గృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు తప్పవు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండండి. రూపాన్ని తగ్గించుకోవడం వలన కొన్ని విషయాలలో లాభపడతారు. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి. సోమవారం మరియు మంగళవారం రోజున ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు మెరున్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. ఉద్యోగ పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు విదేశీ ప్రయోజనాలు కలిసి వస్తాయి. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. సంతానం యొక్క విద్యా విషయాలు బాగున్నాయి. వృత్తి , వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 8 కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ.
సింహం
సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతమార్తంలో కొన్ని పరిస్థితులు చికాకు పెట్టే విధంగా ఉన్నప్పటికీ వారాంతంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం లభిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నిత్యవసర సరుకులు అమ్మే వారికి కూరగాయల వ్యాపారస్తులకు నీళ్లు మరియు పాల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. శుభవార్తలు వింటారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య
కన్యా రాశి వారికి ఈ వారం మధ్యత ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలు వివాహ సంబంధమైన విషయాలు కొంత ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు.వృధా ఖర్చులు పెరుగుతాయి. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బారం తప్పదు. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి కుబేర కుంకుమతో అమ్మవారికి అర్చన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తుల
తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారి పోతాయి. ఆదాయ వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. ఇంటా బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలసివస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వివాహ సంబంధాలు చూస్తున్న వారికి మధ్య సంబంధం కుదురుతుంది. ఏదైనా గుడిలో అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 7 కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీరు మొదలుపెట్టిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మీపై నిందలు వేసేవారు అధికంగా ఉంటారు జాగ్రత్త వహించండి. అవసరానికి ధనం చేతిలో నిల్వఉండదు. ఆదాయం ఎంత వస్తుందో దానికి తగినట్లుగా ఖర్చులు కూడా ఉంటాయి. అప్పులకు దూరంగా ఉండండి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. అన్ని మనకే తెలుసు అన్న ధోరణిని అవలంబించవద్దు. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. స్పెక్యులేషన్ కి షేర్ మార్కెట్ కి దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు కొంతవరకు మేలు చేస్తాయి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల వేయండి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసివచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనస్సు
ధనస్సు రాశి వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతాన సంబంధమైన విషయాలు ఉద్యోగ సంబంధమైన విషయాలు బాగున్నాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. పునర్వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. పెరియర్ పరంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోండి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. శివారాధన ఎక్కువగా చేయండి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మకరం
మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే అవకాశం ఉంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు వివాహ సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్న వారు ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడం మంచిది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలు సూచనలు తప్పక పాటించండి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అప్పులకి క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండటం మంచిది. డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఈ రాశి వారికి కలిసివచ్చేసి ఇంకా ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఏలిన నాటి శని ప్రభావం సరేనా మొదలుపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి. మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు తీరుతాయి. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగం మారాలి అనే ఆలోచనలు వస్తాయి ప్రస్తుతానికి చేస్తున్న ఉద్యోగంలో కొనసాగడం మంచిది. వ్యాపారాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఎవరో చెప్పిన నిర్ణయాలను ఆలోచన చేయకుండా పాటించడం వలన నష్టపోయేది మీరే. ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి అలాగే శనివారం మరియు మంగళవారం రోజు ఆకు పూజ చేయించండి. ఈ రాశి వారికి కలిసివచ్చేసి ఇంకె నాలుగు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం
మీన రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడతాయి మానసికంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది.
ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో శ్రమ పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారు మీరు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది. సినీ రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ప్రేమ వివాహాలు కలిసి రావు. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి. ఈవారం ఓపిక చాలా అవసరం. ప్రతిరోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. శివారాధన ఎక్కువగా చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.











