అమరావతి: కృష్ణమ్మ రాకతో ఫ్లోరైడ్ చరిత్రగా మిగిలిపోతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గోదావరి పుష్కరాల కంటే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని, గోదావరి జలాలను విశాఖకు తీసుకెళ్తామని అన్నారు. మార్కాపురం అన్ స్టాపబుల్ అని.. వెలిగొండ నిర్వాసితులకు పాదాభివందనం తెలియజేశారు. ఈ సందర్భంగా వెలిగొండ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండలు అడ్డొచ్చాయని.. తొలగించి ముందుకెళ్లామని, సమస్యలు వచ్చాయని అధిగమించామని అన్నారు. 2019లో మనం అధికారంలో వచ్చి ఉంటే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేదని, ప్రాజెక్టుకు పట్టిన గ్రహణం 2024లో వీడిందని, చంద్రబాబు పేర్కొన్నారు.

ఎలనినో వల్ల ఏ రిజర్వాయర్లు నిండలేదని, అరకొర చెల్లింపులు చేసి నిర్వాసితులను మోసం చేశారని విమర్శించారు. అయినా తాగునీటి కోసం 10టిఎంసిల నీళ్లు తీసుకొస్తున్నామని, పోలవరం జీవనాడి, 2027 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. పనులు పూర్తవ్వకపోతే ముందే జాతికి అంకితం చేశారని, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రాజెక్టు పూర్తి చేశామని డ్రామా ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. 2019లో మనం అధికారంలో వచ్చి ఉంటే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేదని, నల్లమల సాగర్ నుంచి ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తామని అన్నారు. 2028 నాటికి వెలిగొండ ఫేజ్-2 పూర్తి చేస్తామని, డిఎస్సిపై విషప్రచారం చేస్తే, టీచర్లు తిరగబడ్డారని చెప్పారు. ఓట్లు ఆశించి కాదు, మార్పు ఆశించి పనిచేస్తామని, నెక్ట్స్ ఎలక్షన్ కోసం కాదని, నెక్ట్స్ జరరేషన్ కోసం పనిచేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.