
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి గురువారంనాడు సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బయోగ్యాస్‌ను ప్రోత్సహించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గాను రూ.23,731 కోట్లతో ‘గోబర్దన్’ బయోఎనర్జీ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశానంతరం ఆ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు.
వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ నుంచి ఇంధనం తయారు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. సబ్సిడీ వంటగ్యాస్‌పై భారం తగ్గడం, పర్యావరణ హిత ఇంధన వాడకం లక్ష్యంగా ఈ పథకం అమలు చేస్తామన్నారు. పెట్టుబడి సాయం, పైప్‌లైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్రెడిట్ సపోర్ట్, సాంకేతిక అబివృద్ధికి సహకరించడం ద్వారా దేశ కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) రంగాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు గోబర్దన్ స్కీమ్ ఉద్దేశించినట్టు చెప్పారు. 2026-27 నుంచి 2035-36 వరకూ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు.











