
అహ్మదాబాద్: 76 ఏళ్ల బిచ్చగత్తెను ఎత్తుకెళ్లి అనంతరం ఆమెపై అత్యాచారం చేసి చంపేసి మృతదేహాన్ని అజిమ్ జలాశయంలో పడేసిన సంఘటన గుజరాత్‌లోని రాష్ట్రం రాజ్‌కోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... 76 ఏళ్ల వృద్ధురాలు బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. పది రోజుల క్రితం ఆమె మనవడు ఓ దేవాలయం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. అదే రోజు ఆమెను రమేష్ వాదుకియా అనే వ్యక్తి (33) కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై కర్రతో దాడి చేయడంతో స్పృహతప్పిపడిపోయింది. ఆమెపై అతడు అత్యాచారం చేసి చంపేశాడు. మృతదేహాన్ని అజిమ్ జలాశయంలో పడేశాడు. వృద్ధురాలు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయడంతో సిసి కెమెరాలో రమేష్ తీసుకెళ్లినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. రమేష్‌పై గతంలో పలు కేసులు ఉన్నట్టు సమాచారం. 2018లో మూడేళ్ల బాలికపై కిడ్నాప్ చేయడంతో హత్యాచారం చేశాడు. 2010లో చోటిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.











