న్యూఢిల్లీ: టీమిండియాలో మళ్లీ జట్టు లభిస్తుందనే ఆశలు పెద్దగా లేవని సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో తనకు టీమిండియాలో తిరిగి స్థానం లభిస్తుందనే నమ్మకం లేదన్నాడు. దేశవాళీతో పాటు ఐపిఎల్‌లో మెరుగ్గానే రాణిస్తున్నానని, అయితే టీమిండియాలో చోటు లభించక పోవడం కాస్త బాధగానే ఉందన్నాడు.

అయితే తనకు చోటు దక్కనందుకు ఎవరిని తప్పుపట్టనని స్పష్టం చేశాడు. ఇప్పటికే జాతీయ జట్టు తరఫున చాలా క్రికెట్ ఆడానని, తానెంటో నిరూపించాల్సిన అవసరం లేదన్నాడు. అయితే ఒక వేళ ఛాన్స్ లభిస్తే మాత్రం అరుదైన గౌరవంగా భావిస్తానని భువీ పేర్కొన్నాడు.