సభ్య సమాజమే తలదించుకునే ఘటన ఇది. విద్యార్థులను క్రమశిక్షణతో ఉన్నత స్థానానికి చేర్చాల్సిన కళాశాలను కామకలాపాలకు అడ్డాగా చేసుకున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన పంతుళ్లే అనైతిక బంధానికి కళాశాలను వేదికగా చేసుకోవడం నగరంలో తీవ్ర సంచలనం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోకుల్ ఫ్లాట్స్ లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో అడ్మిన్‌గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి, ఆ కళాశాల మహిళ ప్రిన్సిపాల్‌తో కొంత కాలంగా కళాశాలోని అనైతిక బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరు కళాశాలలోని కార్యాలయంలో తరచూ రాసలీలలు జరుపుతున్నారంటూ వీరి ప్రవర్తన రోజు రోజుకు శృతిమించడంతో కార్యాలయంలో సిసి కెమెరాను ఏర్పాటు చేయడంతో వీరి భాగోతం బట్టబయలైంది. మియాపూర్ ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో మహిళా ప్రిన్సిపాల్, అడ్మిన్ సుబ్బారెడ్డి ఇద్దరు ఈ తతంగం నిర్వహిస్తుండడంతో సంచలనంగా మారింది.

అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఇలాంటి కార్యకలాపాలు కళాశాలలో నిర్వహిస్తే పిల్లలకు ఏం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాసలీలల వీడియోలు బయటకు రావడంతో సమాచారం తెలుసుకున్న భజరంగ్ దళ్ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం కళాశాల ఎదుట ఆందోళన చేశారు. వెంటనే సుబ్బారెడ్డి ఉద్యోగానికి రిజైన్ చేయాలని డిమాండ్ చేయడంతో , అతడు రిజైన్ చేసి వెళ్లిపోయాడు. విద్యా బుద్దులు చెప్పే చోట ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడే వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.