
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శిరోమణి అకాలీదళ్ (సాద్) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శుక్రవారంనాడు కలుసుకున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు హౌస్‌లో ఉభయులు భేటీ అయ్యారు. సమావేశం వివరాలు వెల్లడి కానప్పటికీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరు కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో పాత మిత్రపక్షాలు మళ్లీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.సాగు చట్టాల అంశంపై ఆరేళ్ల క్రితం ఎన్డీయే నుంచి ‘సాద్’ వైదొలిగింది. ఎన్డీయేలో 20 ఏళ్లుగా సాద్ కొనసాగింది.
అయితే 2020లో మూడు వ్యసాయ చట్టాలను కేంద్రం తీసుకురావడంతో సాద్ విభేదించింది. మోదీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఎన్డీయే నుంచి వైదొలిగింది. ఆ తదనంతర క్రమంలో బాదల్ భార్య, లోక్‌సభ ఎంపీ హర్‌సిమ్రత కౌర్ మోదీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి అయ్యారు. గతంలో పంజాబ్‌లో అకాలీదళ్ పెద్దన్న పాత్ర పోషించగా, బీజేపీ చిన్న భాగస్వామిగా ఉండేది. అయితే ఈసారి మాత్రం సమాన ప్రాతిపదికగానే పొత్తు ఉంటుందని బీజేపీ నాయకత్వం సంకేతాలు ఇస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరుగనున్నాయి.











