అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్(బిసిసిఐ), ఇంగ్లండ్(ఇసిబి), ఆస్ట్రేలియా(సిఎ) సంపన్న బోర్డులని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వల్ల కానీ ఓ పనిని బిసిసిఐ మాత్రమే చేస్తూ చరిత్ర సృష్టించింది. అదేంటంటే.. రిటైర్ అయిన ఆటగాళ్లు పెన్షన్ ఇవ్వడమే. అజింక్యా రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అతడికి సీనియర్ టెస్ట్ క్రికెటర్ కావడంతో.. బిసిసిఐ రూ.70 వేలు పెన్షన్ ఇస్తుంది. అటు ఆస్ట్రేలియా కానీ, ఇటు ఇంగ్లండ్ బోర్డులు కానీ రిటైర్ అయిన ఆటగాళ్లకు పెన్షన్ ఇచ్చే సౌకర్యం కల్పించలేదు. దీంతో క్రికెట్ చరిత్రలోనే మాజీ ఆటగాళ్లకు పెన్షన్ కల్పిస్తున్న ఏకైక బోర్డుగా బిసిసిఐ చరిత్ర లిఖించింది.