
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎడుగురు అక్కడికక్కడే మృతి చెందగా,మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జహీరాబాద్ ఎరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.











