మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ’కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ’కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-వరుణ్ తేజ్ ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉంటారు. ఈ కథలో కనకరాజు పాత్రతో పాటు కొరియన్ పాత్ర కూడా ఉంటుంది. ఈ రెండు షేడ్స్‌కు సరిపోయే నటుడు వరుణ్ తేజ్ అనిపించింది.

ఈ సినిమాలో రితిక కొరియన్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. నిజానికి తనకి కొరియన్ భాష కూడా తెలుసు. సినిమాలో ఆమెకు చాలా కొరియన్ డైలాగు లు ఉన్నాయి. అందుకోసం కొరియా నుంచి ఒక ట్యూటర్‌ను తీసుకొ చ్చి హీరో, హీరోయిన్ ఇద్దరికీ కొరియన్‌లో శిక్షణ ఇచ్చాం. అలాగే అనంతపురం యాస కోసం అక్కడి నుంచి కూడా ఒక ట్యూటర్‌ను తీసుకొచ్చాం. -ఇది పూర్తిగా ఫన్ ఎంటర్‌టైనర్. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ ... ఇలా ప్రతి పాత్ర కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇందులో మాఫియా డాన్ ఉన్నా అది కూడా సీరియస్ ట్రీట్‌మెంట్‌లో కాదు. ఫన్‌తోనే నడుస్తుంది. ముఖ్యంగా కొరియన్ ఆత్మ ఆవహించిన తర్వాత హీరో కొరియన్‌లో మాట్లాడుతుంటే మిగతా వాళ్లకు ఏమీ అర్థం కాదు. అక్కడి నుంచే చాలా మంచి కామెడీ వస్తుంది. కొరియాలోని ఒక ఐలాండ్‌లో 20 రోజుల పాటు షూటింగ్ చేశాం. -సినిమాలో ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి ఎమోషన్, హీరో-హీరోయిన్ మధ్య అందమైన లవ్ స్టోరీ కూడా ఉంటుంది”అని అన్నారు.