
జిఎస్‌ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ... శైలజ రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం ‘అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి’. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దర్శకులు సి.రాంప్రసాద్, శివనాగు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు. ‘ట్రైలర్ చాలా బాగుందని, పవన్ మహావీర్‌కి ఇది పరిచయ చిత్రమంటే నమ్మడం కష్టమని‘ అతిధులు పేర్కొన్నారు. నిర్మాత జి. శైలజరెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హీరో మహావీర్, హీరోయిన్లు వర్షిక, సుహానా, దర్శకుడు శివాల ప్రభాకర్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.











