మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా ప ర్యటన రద్దయింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో ని ప్రతినిధి బృందం యూకే, అమెరికా దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, రాజకీయ కోణం లో అనుమతి నిరాకరించినట్టు కేంద్రం తెలియజేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగ పురోగతికి, అలాగే వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ పర్యటన తోడ్పాటునందిస్తుందని అయినా కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ లం డన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలని, బో స్టన్, అమెరికా పర్యటనకు వెళ్లకూడదని సిఎం ని ర్ణయించుకున్నారు. విధి, విధానాలు, ఫ్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి యూకే, అమెరికా పర్యటనకు రాష్ట్రం కేంద్ర అనుమతి కోరింది. తొలుత యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. అధికారిక ప్రతినిధి బృం దం యూ కేకు చేరుకున్న తర్వాత అ మెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.

ప్రఖ్యాత విద్యా సంస్థలను

భారత్‌కు, తెలంగాణకు

తీసుకురావాలన్నదే ధ్యేయం

కేంద్ర నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే, కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగం గా ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను భారత్‌కు, తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావాలన్నదే తన లక్షమని ఆయన తెలిపారు. అత్యుత్తమ ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను, ప్ర పంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి వి ద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న మన యు వత ఆకాంక్షలకు ఇవి సమాధానంగా నిలిచేవని ఆయన పేర్కొన్నారు. దేశ నిర్మాణం, యువత భ విష్యత్ విషయానికి వస్తే అందరూ రాజకీయా లు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని తా ను ఎప్పుడూ విశ్వసిస్తానని ముఖ్యమంత్రి వ్యా ఖ్యానించారు. వివిధ విశ్వవిద్యాలయాలతో ఇ ప్పటికే సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో అమెరికా పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలను అధికారుల బృందం కొనసాగించాలని, ఆయా విశ్వవిద్యాలయాలతో అవసరమైన అన్ని అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అ ధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌ను ప్ర పంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సిఎం తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి హెచ్‌సీయూ, జేఎన్‌టియూ తదితర విశ్వవిద్యాలయాల ఏర్పాటు హైదరాబాద్‌ను అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా మార్చిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక పాఠశాల ప్రపంచానికి నాయకత్వం వహించగలమని నిరూపించిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అక్కడి నుంచి ప్రపంచంలోని గొప్ప టెక్ నాయకుల్లో కొందరు రూపుదిద్దుకున్నారని, ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ వం టి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్ అగ్రశ్రేణి కా ర్పొరేషన్లు, వాటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించగలిగామని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రపంచంలోని ప్రఖ్యాత విద్య, నైపుణ్య సంస్థలకు హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్ది, 21వ శతాబ్దపు మన ప్రగతి ప్రయాణానికి శక్తినిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం యూకేలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థలను సందర్శించి, వాటి ప్రతినిధులతో సమావేశాలు కొనసాగించనున్నారు. యునైటెడ్ కిం గ్‌డమ్‌లోని ప్రముఖ క్రీడా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి రంగ నాయకులతో సమావేశమై, తెలంగాణతో భాగస్వామ్యాలను అధికారికంగా ఖరారు చేసేందుకు

ఈ పర్యటనలో ప్రయత్నిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని ఆయన తెలిపారు. ఒక సాధారణ భారతీయుడు హై దరాబాద్‌లోనే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ లేదా ఎంఐటీ, ఎల్‌బీఎస్, ఎల్‌ఎస్‌ఈ వంటి ప్రపంచ స్థాయి సంస్థల నుంచి విద్య, సర్టిఫికేషన్ పొందగలగాలని ఆయన అన్నారు. ఎందుకంటే చాలామంది నాయకులు త మ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకుంటార ని, కానీ,తాను ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సం స్థలను భారత్‌కు తీసుకురావాలని అభిలషిస్తున్నానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.