హైదరాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లిలో దారుణం జరిగింది. బెట్టింగ్ యాప్ లు, క్రెడిట్ కార్డుల ద్వారా ఓ యువకుడు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఇంట్లో ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.