సక్సెస్‌ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా ‘కెజెక్యూ’ (కింగ్ - జాకీ - క్వీన్). 1990ల నాటి నేపథ్యం లో సాగే ఈ చిత్రంలో ’దసరా’, ’ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నా రు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు కెకె(కిరణ్ )కి ఇది చివరి చిత్రం. ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ “సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కింగ్, జాకీ, క్వీన్ పాత్రలు మీకు గుర్తుండిపోతాయి. ఈ సినిమా అందరినీ ఖచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది”అని అన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ మాట్లాడు తూ “ఈ సినిమా స్క్రిప్ట్ స్టేజ్ నుంచే నేను ఈ ప్రాజెక్ట్‌తో ఉన్నాను. కిరణ్ మనందరినీ విడిచి వెళ్లిపోవడం చాలా బాధాకరం. ఆయన కలను నిజం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో శ్రద్ధగా రూపొందించాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మ కం ఉంది”అని తెలిపారు. ఈ సమావేశంలో హీరో శశి, హీరోయిన్ యుక్తి తరేజా పాల్గొన్నారు.