న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభించినప్పటికీ విపక్షాల ఆందోళనల మధ్య ప్రతిష్ఠంభ న కొనసాగుతోంది. ఈనెల 13వ తేదీతో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ప్రతిష్టంభన తొలగించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఇదే స మయంలో పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వా యిదా వేయకుండానే 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశా లు నిర్వహించే దిశగా కేం ద్రం కసరత్తు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఈనె ల 16,17,18 తేదీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలనే ఆలోచనలో కేంద్రం ఉందని అం టున్నారు. నియోజకవర్గాల విభజన బిల్లు (డీలిమిటేషన్ బిల్లు)ను గత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టినప్పటికీ అది మెజారిటీ లేకపోవడంతో చట్టసభల్లో వీగిపోయింది.జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని,

ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా యూపీ, బీహార్‌కు సీట్లు, రాజకీయ బలం పెరుగుతాయని విపక్షాలు వాదించాయి.దీంతో పాటు మహిళా రిజర్వేషన్‌తో దీనిని ముడిపెట్టడంతో మహిళా రిజర్వేషన్‌ను ప్రస్తుతమున్న సీట్లలోనే తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో రెండు బిల్లులూ ప్రత్యేక మెజారిటీ లేకపోవడంతో చట్టసభల్లో వీగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఈ రెండు బిల్లులను మరోసారి తెచ్చేందుకు కేంద్రం పట్టుదలగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం మూడురోజుల ప్రత్యేక సమావేశాలకు కసరత్తు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో తాజా ప్రచారం జరుగుతోంది. డీలిమిటేషన్ బిల్లును తొలుత ప్రవేశపెట్టి, ఇండిపెండెన్స్ డే తరువాత రోజు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది

రాహుల్‌ను కలిసిన రిజిజు

మరోవైపు పార్లమెంటులో 13 రోజులుగా నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు కేంద్రం మంతనాలు జరుపుతోంది. ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ బుధవారంనాడు వాయిదా పడిన వెంటనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్ర కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. పార్లమెంటు హౌస్‌లోని రాహుల్ ఛాంబర్‌లో సుమారు 50 నిమిషాలు ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఎంపీలు ప్రియాకం గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్ తదితరులు రాహుల్‌తో కలిసి పాల్గొన్నారు. పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను తొలగించాల్సిందిగా

రాహుల్‌కు రిజిజు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో డీలిమిటేషన్ బిల్లు, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్ సవరణ బిల్లుపై ప్రధానంగా చర్చలు జరిగినట్టు చెబుతున్నారు. అయితే రిజిజు అభ్యర్థనను రాహుల్ తిరస్కరించినట్టు తెలిసింది. అయోధ్య రామమందిరంలో జరిగిన విరాళాల చోరీ ఆరోపణలపై సభలో చర్చ జరగాలని, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జులై 20న జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యకు సంబంధించి హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని రాహుల్ పట్టుబట్టినట్టు తెలిసింది. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో రిజిజు సమావేశమయ్యారు.

లోక్‌సభ వాయిదా

లోక్‌సభలో బుధవారంనాడు కూడా విపక్షాలు ఎలాంటి సభాకార్యక్రమాలు జరక్కుండా ఆందోళన కొనసాగించాయి. దీంతో ఎలాంటి చర్చా లేకుండానే ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు’ను మూజవాణి ఓటుతో సభ ఆమోదించింది. తొలుత ప్రశ్నాత్తర కార్యక్రమాలను విపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమాలను జరగనీయాలని స్పీకర్ ఓం బిర్లా విపక్షాల విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన 13వ రోజు కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకోవడం, సభ వెలుపల, బయట విపక్షాల నినాదాల పట్ల స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ ఒకసారి వాయిదా పడి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశం కాగానే, బ్యాంకర్స్ బుక్స్ అవిడెన్స్ బిల్లుపై చర్చను చేపట్టాలని సభ్యులను స్పీకర్ కోరారు. విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో బిల్లుపై ఓటంగ్‌కు స్పీకర్ ఆదేశించారు. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందగానే సభను మరుసటి రోజుకి వాయిదా వేశారు.