
మన తెలంగాణ/ సిటీబ్యూరో: అడ్డదారిలో ఫైర్ ఎన్‌ఓసీలను తీసుకునేందుకు హైడ్రా కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసిన విద్యాసంస్థల బాగోతం బట్టబయలైంది.52 కళాశాలలుహైడ్రా కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసి ఫైర్ ఎన్‌ఓసీలను విద్యాశాఖకు సమర్పించినట్లు విచారణలో తేలింది. సదరు కళాశాలలపై లేక్ పోలీసు స్టేషన్‌లో హైడ్రా ఫిర్యాదు చేసింది. ఆయా కళాశాలలపై కేసులు నమోదయ్యాయి. ఈ విద్యాసంస్థల గుర్తింపులను రద్దు చేయాలని విద్యాశాఖ ఉన్నతస్థాయి అధికారులకు హైడ్రా ఫిర్యాదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలోని అన్ని కళాశాలలు సమర్పించిన ఫైర్ ఎన్‌ఓసీలపై దృష్టిసారించి విచారణ చేపట్టగా 52 కళాశాలలు ఫోర్జరీ సంతకాలతో సృష్టించిన ఎన్‌ఓసీలను సమర్పించాయనేది తేలిపోయిం ది. '
దిగ్బ్రాంతికిలోనైన హైడ్రా కమిషనర్ వెంటనే విద్యాశాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీ సుకెళ్లి వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లేఖలు రాసినట్లు అధికారులు తెలిపారు. నగరం నడిబొడ్డున ఉన్న హిమాయత్‌సగర్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల ఫైర్ ఎన్‌ఓసీని సమర్పించిం ది. దీనిని విద్యాశాఖ అధికారులు అనుమానించకుండా స్వీకరించడంతో మరిన్ని కళాశాలలు అ దే బాటపట్టి.. అవి కూడా ఫోర్జరీ సంతకాల సర్టిఫికె ట్లు విద్యాశాఖకు సమర్పించినట్లు తెలుస్తోంది. కో ర్ అర్బన్ రీజియన్‌లోని చాలా కళాశాలలు నకి లీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించి విద్యాశాఖ అధికారులను మేనేజ్ చేసినట్టు ఆరోపణలున్నాయి.
హైందవీ కళాశాల సమర్పించిన ఫైర్ ఎన్‌ఓసీని అనుమానించిన అధికారులు ఆ సర్టిఫికెట్‌ను హైడ్రాకు పంపించి.. ఇది మీరు జారీచేసిన ఫైర్ ఎన్‌ఓసీయేనా..? అని పేర్కొనగా.. హైడ్రా అధికారులు దానిని క్షుణ్ణంగా పరిశీలించడంతో.. అది ఫోర్జరీ సంతకంతో సృష్టించిన నకిలీ సర్టిఫికెట్ అని తేలింది. దీంతో ఇటీవల ఎన్ని ఫైర్ ఎన్‌ఓసీలు అందాయి..? వాటినిపంపించాలని హైడ్రా కోరడంతో విద్యాశాఖఅధికారులు 8 ఫైర్ ఎన్‌ఓసీలను మొదటగా పంపించారు. అవన్నీ ఫోర్జరీ సంతకాలతో సృష్టించిన నకిలీ సర్టిఫికెట్స్ అని హైడ్రా తేల్చేసింది. వెంటనే లేక్ పోలీసు స్టేషన్‌లో సంతకాన్ని ఫోర్జరీచేసి ఫైర్ ఎన్‌ఓసీలను సమర్పించిన 8 కళాశాలలైన హైందవి, రిసోనెన్స్, ప్రియాంక, మథర్స్ గర్ల్, శ్రీచంద్ర, న్యూ ఎరా, షాహీన్, వశిష్ఠ జూనియర్ కళాశాలలపై హైడ్రా ఫిర్యాదు చేసింది.
కన్సల్టెన్సీ పనియేనా..?
వాస్తవానికి ప్రైవేట్ జూనియర్ కళాశాలల భవనాలన్నీ కూడా కమర్షియల్ భవనాలు. ఇవి భవన నిర్మాణ నియమాలను ఉల్లంఘించి నిర్మించినవే. దాదాపు 95శాతం భవనాలన్నీ అక్రమ నిర్మాణాలే. ఇవి నిబంధనలు అతిక్రమించి నిర్మించిన భవనాలు కావడంతో వీటికి ఫైర్ ఎన్‌ఓసీ మంజూరు చేయడానికి నియమ నిబంధనలు ససేమిరా అంటాయి. దీంతో కళాశాలను నడవాలంటే.. విద్యాశాఖ అనుమతి కావాలి. ఫైర్ ఎన్‌ఓసీ తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ కళాశాల యజమాని ఓ కన్సల్టెన్సీని కలిశారు. విషయాన్ని వివరించారు.
ఆ కన్సల్టెన్సీ బాగా ఆలోచించి.. నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ సమర్పించి అధికారులకు అనుమానం రాకుండా చూసుకుంటే చాలు. ఫైర్ ఎన్‌ఓసీ సమర్పించడం, అనుమతులు మంజూరు కావడం. కాలేజ్ నడవడం చకచకా జరిగిపోతుందని కన్సల్టెన్సీ చెప్పడంతో అందుకు అంగీకరించిన ఆ ప్రైవేట్ కాలేజ్ యజమాని గుట్టుచప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్‌తో అనుమతులు పొంది కళాశాలను నడిపిస్తున్నారు. ఇది గమనించిన ఇతర కాలేజ్‌ల వారు కూడా ఆ కన్సల్టెన్సీని ఆశ్రయించడం.. నకిలీ సర్టిఫికెట్లను తీసుకుని అధికారులకు సమర్పించడం.. అనుమతులను పొందడం పరిపాటిగా మారిందని ఓ అధికారి వివరించారు.
జులై 4న ఫిర్యాదు: హైడ్రా
నకిలీ(ఫేక్) ఫైర్ ఎన్‌వోసీల విషయాన్ని హైడ్రా సీరియస్‌గా తీసుకుంది. ఈపాటికే ఇంటర్ బోర్డుకు లేఖ రాసి వివరాలు సేకరించిన హైడ్రా.. జులై 4న లేక్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జూనియర్ కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన నకిలీ/ఫోర్జరీ ఫైర్ ఎన్‌వోసీలపై విచారణ చేపట్టింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీక్యూర్) పరిధిలో 142 జూనియర్ కళాశాలలు ఫైర్ ఎన్‌వోసీలు సమర్పించగా.. అందులో 90 వరకు ఒరిజినల్‌విగా ఉండగా.. 52 ధ్రువీకరణ పత్రాలు నకిలీవని తేలింది. ఈ నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై తదుపరి చర్యలకు ఉద్దేశించి జులై 4న నెక్లెస్ రోడ్డులోని లేక్ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా హైడ్రా నమోదు చేసింది.
మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలఇంటర్మీడియట్ విద్యాధికారులు (డీఐఈఓ) మొత్తం 76 ఫైర్ ఎన్‌వోసీలను ప్రామాణికత నిర్ధారణ కోసంపంపించారు.వాటిని హైడ్రాపరిశీలించగా, 7 ఫైర్ ఎన్‌వోసీలు నకిలీ/ ఫోర్జరీవని తేలింది. రెండో దశలో ఇంటర్మీడియట్ విద్యాధికారులు మొత్తం 66 ఫైర్ ఎన్‌వోసీలను ధృవీకరణ కోసం హైడ్రాకు పంపించగా.. హైడ్రా పరిశీలనలో 45 ఫైర్ ఎన్‌వోసీలు నకిలీ/ఫోర్జరీ చేసినవిగాతేలింది.ఆయా కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్‌బోర్డుకు హైడ్రా సూచించింది.








