న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా నిలిచిన భారత యువ సంచలనం అనాహత్ సింగ్‌ను ప్రధాని మోడీ అభినందించారు. ఎక్స్‌ వేదికగా ఆమెను మోడీ ప్రశంసించారు. అనాహత్ విజయం దేశానికి గర్వకారణమన్నారు. ఈ ఘనత భారత స్క్వాష్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని.. యువతలో స్క్వాష్ క్రీడపై ఆసక్తిని మరింత పెంచుతుందని ప్ఱధాని మోడీ తన సందేశంలో తెలిపారు.

ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ రికార్డు నెలకొల్పింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న అనాహత్.. రుకాయ సాలెమ్ (ఈజిప్ట్‌)ను ఫైనల్స్‌లో ఓడించింది. ఈ టోర్నీలో పతకం సాధించడం 18 ఏళ్ల అనాహత్‌కు ఇది వరుసగా రెండోసారి. నిరుడు కాంస్యంతో నెగ్గిన ఆమె ఈసారి స్వర్ణం చేజిక్కించుకుంది.