
ఈ రోజు ఒప్పు్పకోక తప్పదు
ఊరి చివర తుప్పల్లోను
వీధి మూల సందుల్లోనూ
గుత్తులుగా పూసిన అనాథ పూలు
అందాన్ని ఊరేగిస్తూ ఆకాశాన్ని ముద్దాడుతుంటే
గెలుపు ఒప్పు్పకోక తప్పదు
ఎక్కడో వీధి చివర వెలివేసిన బొక్కెడు మల్లె
ఈసడింపులను ఎదురీదుకొని
ఎండా వానను భరించుకొని
ఒక్క వసంతానికై వేచే ఆశకు
మరే ఋతువైనా చిన్నబోదా?
వేర్లు తెంపి, తుంచేసినామొదల్లు పీకి పారేసినా
ఎక్కడో కొన ఊపిరితోమళ్ళీ వేళ్ళూనుకునాలనే
ఓ ప్రయత్నం ఉంటే చాలదా?
ఏ వసంతమో వచ్చి ఆదుకోదా?
- వినోద్ కుత్తుం











