
అమరావతి: వివాహితుడితో ప్రేమలో పడిందనే అనుమానంతో కన్న కూతురును చంపేశాడు. అనంతరం కన్నతల్లిని కుమారుడు హత్య చేసి తమ్ముడి భార్యను చంపేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు కాపాడారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా సిద్దవటం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... చలమారెడ్డిపల్లె గ్రామంలోని దండోరా కాలనీలో చెవిటివాండ్ల బాబు, సుజాత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు హారిక ఉంది. బాబు పెయిటింగ్ వర్క్‌లో మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుజాత రిమ్స్‌లో స్వీపర్‌గా పని చేస్తుంది. అదే కాలనీకి చెందిన వివాహితుడితో హారిక చనువుగా ఉండడంతో కూతురుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కూతురు బయటకు వెళ్లకుండా తన తల్లి ఓబులమ్మను కాపాలా పెట్టాడు. జులై 31న పెన్షన్ డబ్బుల కోసం ఓబులమ్మ తన మైదుకూరు మండలానికి వెళ్లింది. ఇంట్లో కూతురు ఒంటిరిగా ఉండడంతో ఆమెపై కన్న తండ్రి దాడి చేసి చంపేశాడు. అనంతరం ఓబులమ్మ వద్దకు వెళ్లి ఆమెను గొంతు నులిమి హత్య మార్చాడు. అనంతరం పొన్నవోలు వెళ్లి తన తమ్ముడి భార్య ఒంటరిగా ఎందుకు ఉన్నావంటూ మరదలును బాబు చంపడానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానమే ఇద్దరి ప్రాణాలను తీసింది.











