హైదరాబాద్: టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోవ వైరల్‌గా మారాయి. తనతో కలిసిన ఆడిన టాప్-5 బౌలర్లను ప్రకటించాడు. స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్‌కు ఐదో స్థానం కేటాయించడంతో అతడి సారీ చెప్పడంతో పర్సనల్‌గా మెసేజ్ చేస్తానని వివరణ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్‌కు అశ్విన్ కెప్టెన్సీలో అర్ష్‌దీప్ సింగ్ బౌలర్‌గా ఉన్నాడు. అశ్విన్ కెప్టెన్సీలో మూడు ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 2019లో మినీ వేలంలో అర్ష్‌దీప్ సింగ్ ను పంజాబ్ జట్టు రూ.20 లక్షల ప్రైజ్‌మనీకి కొనుగోలు చేసిన విషయం విధితమే.

భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలర్ అని, అతడి పట్ల తనకు కొంత వ్యక్తిగత అభిమానం ఉందన్నారు. భువీకి తొలి స్థానం ఇచ్చానని అర్ష్‌దీప్ వివరణ ఇచ్చాడు. రెండోస్థానంలో షమీ, మూడో స్థానం కులదీప్ సింగ్, నాలుగో స్థానం యుజేంద్ర చాహల్, ఐదో స్థానం రవి చంద్రన్ అశ్విన్‌కు ఇచ్చాడు. అశ్విన్ చివరి స్థానంలో పెట్టడం ఇష్టం లేదు కానీ నాలుగు స్థానాలు నిండిపోవడంతో ఐదో స్థానం ఇవ్వాల్సి వచ్చిందన్నారు.