సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ పెళ్లి వార్త మరోసారి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కావ్య పెళ్లి గురించిన వార్తలు చాలానే వచ్చాయి. ఈ సారి ఆ వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కావ్య ప్రేమలో ఉందని ఎప్పటి నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకసారి వీరిద్దరు అమెరికాలో జంటగా కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వైరల్ అయ్యాయి.

అయితే వీటికి అనిరుధ్ అప్పుడే చెక్ పెట్టేశాడు. అలాంటిదేమీ లేదని సోషల్‌మీడియా వేదికగా స్పష్టత ఇచ్చాడు. అయితే తాజాగా వీరిద్దరి వివాహ వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి పెళ్లి వేదిక కూడా ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారని టాక్ నడుస్తోంది. తాజాగా ఓ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఇద్దరి కుటుంబాలు స్పెయిన్‌లో వీరి వివాహం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఇలాంటి వార్తలే రావడం అవి అవాస్తవాలు అని తేలడంతో ఈ వార్తలు కూడా అలాంటివే అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజులు ఆగితే వీరి రిలేషన్‌షిప్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.