హైదరాబాద్: అత్యవసర చికిత్స కోసం అవయవాలను తరలించేందుకు హైదరాబాద్ మెట్రో అధికారులు గ్రీన్ ఛానల ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్‌కు గుండె, ఊపిరితిత్తల్ని తరలించేందుకు సహకరించారు. వైద్యులు 14 కి.మి దూరంలో కిమ్స్‌కు కేవలం 25 నిమిషాల్లో వాటిని విజయవంతంగా చేర్చారు. అత్యవసర ఆరోగ్య కార్యక్రమాల కోసం మెట్రో మద్దతిస్తుందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ప్రాణాలు కాపాడే వైద్య చర్యలకూ తమ వంతు సహకారం ఉంటుందన్నారు.